
అమరావతి, 10 జూన్ (హి.స.)
ముదిగుబ్బ: సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో బుధవారం కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ముదిగుబ్బకి చెందిన ఆదెప్ప.. తన కుటుంబ సభ్యులతో కలిసి గంగిరెడ్డిపల్లి గ్రామం దగ్గరున్న పోతులయ్య స్వామి గుడికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో హుస్సేన్ పురం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆదెప్ప, కుటుంబసభ్యులు వెంటనే బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ