
మహబూబ్నగర్, 28 జూలై (హి.స.) జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐర్) కార్యక్రమంలోని 'ఎన్యూమరేషన్ ఫారాల' స్వీకరణను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులకు(బిఎల్బీలకు) అందజేయాలని, ఇంకా ఫారాలు సమర్పించని వారు వెంటనే సమర్పించాలని ఆమె సూచించారు.
ఎన్యూమరేషన్ ఫారాలు అందుకొని వారి వివరాలను బీఎలీలు పరిశీలించి వెంటనే డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కావని, దీంతో వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. కాబట్టి ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా బిఎల్డీ లు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..