థర్డ్ లాంగ్వేజ్లో జర్మన్, జపనీస్ భాషలు చేర్చాలి: మంత్రి వివేక్
కేంద్రమంత్రి కిషన్రెడ్డితో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ.
Kishan reddy


హైదరాబాద్, 28 జూలై (హి.స.)విదేశీ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయని, థర్డ్ లాంగ్వేజ్లో జర్మన్, జపనీస్ భాషలకు అవకాశమివ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌధరిని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఆయన ఎంపీ వంశీకృష్ణతో కలిసి పలువురు కేంద్రమంత్రులను కలిశామని ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి జీవో ఇవ్వాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి విన్నవించారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి కలిశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande