రామగుండంలో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
రామగుండంలో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
Collector


రామగుండం, 28 జూలై (హి.స.)

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీయూఎఫ్డీసీ (TUFIDC), డీఎంఎన్టీ (DMFT), ఇతర నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభివృద్ధి పనుల పురోగతి, నిధుల వినియోగం, పనుల నాణ్యతపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, పనుల అమలులో నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

టీయూఎఫ్ఎడీసీ, డీఎంఎన్టీతో పాటు ఇతర నిధులతో చేపట్టిన పనులన్నింటినీ నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రామగుండం మండలంలోని గోదావరిఖని (విఠల్నగర్) లో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భవనాల పరిస్థితి, మౌలిక వసతులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన అదనపు గదులు, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంచనాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేసి సమర్పించాలని

పాఠశాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా అవసరమైన అన్ని చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande