డేటా సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో ఓ డేటా సెంటర్(Data Center)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్(Google Cloud) సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గూగుల్ సంస్
Fire


న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో ఓ డేటా

సెంటర్(Data Center)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్(Google Cloud) సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గూగుల్ సంస్థ తన అధికారిక క్లౌడ్ స్టేటస్ పేజీలో వెల్లడించింది. డేటా సెంటర్లో మంటలు చెలరేగడంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి నెట్వర్క్ పరికరాలకు విద్యుత్ సరఫరాను అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ఢిల్లీలోని లోకల్ 'పాయింట్ ఆఫ్ ప్రజెన్స్' (PoP) పూర్తిగా ఐసోలేట్ అయింది. ఫలితంగా కేవలం ఢిల్లీలోనే కాకుండా ముంబై, చెన్నై, దేశంలోని ఇతర ప్రధాన నగరాల చుట్టుపక్కల ప్రాంతాలలో గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల ఐటీ కంపెనీలు, డిజిటల్ సేవల వినియోగదారులు కొంత సమయం పాటు తీవ్ర నెట్వర్క్ లేటెన్సీ, పాకెట్ లాస్ వంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ బృందం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించి (Re-routing), సేవలను పునరుద్ధరించే పనులను ముమ్మరం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande