ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
కాబూల్ 10 జూన్ (హి.స.) పాకిస్థాన్ బుధవారం చేపట్టిన దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందినట్లు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) ప్రకటించింది. ఆ దాడిలో మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులను టా
Pakistan


కాబూల్ 10 జూన్ (హి.స.)

పాకిస్థాన్ బుధవారం చేపట్టిన దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందినట్లు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) ప్రకటించింది. ఆ దాడిలో మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులను టార్గెట్ చేసినట్లు తాలిబన్ చీఫ్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఓ మహిళ, ఓ వృద్ధుడు చనిపోయినట్లు చెప్పారు. ఈ దాడుల గురించి పాకిస్థాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గత ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఫైటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పోరులో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. పాక్ జరిపిన వైమానిక దాడులకు కౌంటర్గా ఆఫ్ఘనిస్తాన్ సీమాంతర అటాక్ చేసింది. పాకిస్థాన్లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తున్నట్లు పాక్ ఆరోపిస్తున్నది. పాకిస్థానీ తాలిబన్ అలియాస్ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ వ్యవస్థ దాడులు చేస్తున్నట్లు పాక్ పేర్కొన్నది. ఆఫ్ఘన్ తాలిబన్తో ఆ సంస్థకు లింకు ఉన్నట్లు పాక్ ఆరోపిస్తున్నది. కానీ కాబూల్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande