'ఈసీని ఆశ్రయించండి'- నటరాజన్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
'ఈసీని ఆశ్రయించండి'- నటరాజన్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court


డిల్లీ, 12 జూన్ (హి.స.)

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరిస్తే, ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కేసు యోగ్యత (మెరిట్స్) గురించి తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఆర్టికల్ 32/226 ప్రకారం జోక్యం చేసుకోవాల్సిన కేసులు, నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన ఇతర కేసులను గుర్తించడానికి న్యాయస్థానం అంగీకరిస్తే, ఆర్టికల్ 329 పరిధిలో లేని ఒక సూత్రాన్ని ఈ కోర్టు అన్వయించినట్లు అవుతుంది. అంతేకాదు కొన్ని విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చని, మరికొన్నింటిని ఎన్నికల ట్రిబ్యునల్ విచారణకు వదిలివేయాలనే వ్యాఖ్యానాలను ప్రోత్సహించేందుకు మేము భయపడుతున్నాం అని సుప్రీంకోర్టు పేర్కొంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది. కోర్టు కేసుల వల్ల ఎన్నికలు ఆలస్యం కాకుండా చూస్తుంది. అందువల్ల రిటర్నింగ్ అధికారి ఒక అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించిన తర్వాత, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే ఏకైక మార్గం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ తరఫు న్యాయవాదిని ఉద్దేశిస్తూ, ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకున్నట్లు ఏదైనా తీర్పును చూపించండి అని సుప్రీంకోర్టు అడిగింది.

దీనితో నటరాజన్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి తన వాదనలు వినిపిస్తూ, కనీసం రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసును మాత్రమే అభ్యర్థి వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత వ్యవహారంలో కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రిమినల్ కేసులను వెల్లడించలేదనే కారణం చూపిస్తూ, మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి తప్పుడు విధానంలో తిరస్కరించారు అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande