థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? హోమియోపతి మందులతో..థైరాయిడ్కు శాశ్వత చికిత్స..
థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? హోమియోపతి మందులతో..థైరాయిడ్కు శాశ్వత చికిత్స..
థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?హోమియోపతి మందులతో..థైరాయిడ్కు శాశ్వత చికిత్స..


బెంగళూరు, 16 జూన్ (హి.స.)మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. చాలా మంది హైపర్ థైరాయిడ్ లేదా హైపో థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలైతే అది హైపర్. తక్కువగా ఉంటే అది హైపో. అయితే..ఈ అనారోగ్యాన్ని తగ్గించుకోడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల పరిష్కారం దొరికినప్పటికీ తరచూ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అలాంటప్పుడే సహజ సిద్ధమైన మందులు వాడాలి. అంటే. .హోమియోపతి వైద్యం లేదా ఆయుర్వేదంవైపు మళ్లాలి.హోమియోపతి వైద్యంలో అన్ని సమస్యలకూ పరిష్కారాలుంటాయి. థైరాయిడ్ విషయానికొస్తే కేవలం ఒకే ఒక పదార్థంతో తగ్గిపోతుంది. కాంచనార అనే మొక్కతో థైరాయిడ్ కి చెక్ పెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

థైరాయిడ్ అంటే ఏమిటి?

మన మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ‘థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్’ (టీఎస్హెచ్) థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంటుంది. మెదడు నుంచి సంకేతాల ఆధారంగానే థైరాయిడ్ టీ3, టీ4 హార్మోన్లు ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్లు అధికంగా విడుదలైతే హైపర్ థైరాయిడ్ వస్తుంది. ఇది ఉన్నవారిలో శరీర అవయవాలు వేగంగా పనిచేస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, క్యాలరీలు త్వరగా తగ్గిపోయి బక్కపలచగా అవడం, విపరీతమైన ఆకలి, కంగారు, ఆందోళన కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేస్తే హైపోథైరాయిడ్ వస్తుంది. దీంతో శరీర అవయాలు నెమ్మదిగా కదులుతాయి. క్యాలరీలు త్వరగా కరిగే అవకాశం లేక బరువు పెరుగుతారు. నెలసరి సమయానికి రాక గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి.

థైరాయిడ్కి హోమియోపతిలో శాశ్వత చికిత్స ఉందా?

థైరాయిడ్ సమస్యతో ఎంత కాలం నుంచి ఉంది అనే దాని ఆధారంగా హోమియోపతిలో చికిత్స ఉంటుంది. వ్యాధి దీర్ఘకాలికంగా లేనివారికి శాశ్వత చికిత్స సాధ్యమే అంటున్నారు హోమియో నిపుణులు. ఒక వ్యక్తి 5 నుంచి 6 సంవత్సరాలుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే హోమియోపతి చికిత్స చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. అయితే,10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పూర్తిగా నయం చేయడం కష్టమవుతుందని చెబుతున్నారు. రోగి TSH స్థాయి 200 లేదా అంతకంటే తక్కువ ఉంటే హోమియోపతితో థైరాయిడ్ చికిత్స సాధ్యమవుతుందని హోమియోపతిడాక్టర్ బి ఎస్ అనురాధాచెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యులు సూచించిన మందులతో పాటు సరైన జీవనశైలిని అవలంబిస్తే ఫలితం దక్కుతుంది. తద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు.

హోమియోపతిలో రెండు పద్ధతుల్లో చికిత్సలు..

మొదటి పద్ధతి-మొదటి పద్ధతి క్లాసిక్ చికిత్స. వ్యక్తి మానసిక స్థితి, శారీరక లక్షణాలు ఆధారంగా వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు. ఈ విధానం రోగి మానసిక, శారీరక మార్పులను తీసుకువచ్చి పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రెండవ పద్ధతి-నిర్దిష్ట కాలంపాటు రోగికి వివిధ రకాల మందులు ఇస్తారు. వీటిలో రోగికి సరిపోయే ఔషధం చాలా కాలం పాటు ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, ఈ పద్ధతి అంత ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే, ప్రారంభంలో కొంత మెరుగుదల కనిపించినా మందుల ప్రభావం కాలక్రమేణా తగ్గిపోవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande