టెలిగ్రామ్పై కేంద్రం కీలక నిర్ణయం- నీట్ పరీక్ష అయ్యే వరకు బ్యాన్
టెలిగ్రామ్పై కేంద్రం కీలక నిర్ణయం- నీట్ పరీక్ష అయ్యే వరకు బ్యాన్
Neet


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్షను తిరిగి నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించి సమాచారం లీక్ చేసేందుకు అవకాశం లేకుండా మెసేజింగ్ ప్లాట్ఫాం టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఎన్టీఏ సిఫార్స్ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆంక్షలు కేవలం పరీక్షా సమయం, ఆ తర్వాత కొంతకాలానికి మాత్రమే పరిమితమని ఎన్టీఏ పేర్కొంది.

ఈ నిర్ణయం వల్ల టెలిగ్రామ్ను ఉపయోగించే లక్షలాది మంది యూజర్లకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. జూన్ 30వరకు 'మెసేజ్-ఎడిటింగ్' ఫీచర్ను కూడా నిలిపివేయాలని టెలిగ్రామ్ను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. గతంలో అడ్మినిస్ట్రేటర్లు అంతకుముందు పోస్ట్ చేసిన సందేశాలను ఎడిట్ చేయడానికి, అటాచ్ చేసిన ఫైళ్లను మార్చినప్పటికీ టైమ్స్టాంప్ అలాగే ఉండేలా చేయడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేశారని, తద్వారా పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలను సృష్టించారని తెలిపింది. నీట్ అభ్యర్థులను మోసగించడానికి చీటింగ్ రాకెట్లు ఈ ప్లాట్ఫారమ్ను వ్యవస్థీకృతంగా వినియోగిస్తుండటానికి ప్రతిస్పందనగా శాంతిభద్రతల పరిరక్షణ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande