
ముంబై, 24 జూన్ (హి.స.)బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పదంతో అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో డాలర్ బలపడి బంగారం ధర తగ్గుతోంది. మంళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా రూ.1,930 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,44,590 వద్ద కొనసాగుతుండగా , 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రైడవుతుంది.
హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,590, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,540గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,44,590, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,540 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV