బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. లేటెస్ట్గా తులం ఎంతుందంటే..
Gold worth Rs34 lakhs seized from inside female passengers burqa at Ahmedabad airport


ముంబై, 25 జూలై (హి.స.)బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. సోమవారం నుంచి పెరిగిన ధరలు.. శుక్రవారం కాస్త ఊరటనిచ్చాయి.. శుక్రవారం ఒక్కరోజే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.1700ల మేర ధర తగ్గింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి..

పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా శనివారం (జులై 25) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,44,320 గా ఉంది.22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి రూ.1,32,290 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande