మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Gold and silver prices fell in early trade in the bullion market


ముంబై, 15 ఆగస్టు (హి.స.)బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గుదలకు బ్రేక్ పడింది. శనివారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులే కారణంగా నిపుణులు చెబుతున్నాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande