పార్లమెంట్ కేవలం గొడవలకు వేదిక కాదు, ప్రశ్నలు-సమాధానాల కేంద్రం కావాలి: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పిలుపు
పార్లమెంట్ కేవలం గొడవలకు వేదిక కాదు, ప్రశ్నలు-సమాధానాల కేంద్రం కావాలి: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పిలుపు
పార్లమెంట్ కేవలం గొడవలకు వేదిక కాదు, ప్రశ్నలు-సమాధానాల కేంద్రం కావాలి: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పిలుపు


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

ఇవాళ ఉదయం ఢిల్లీలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ పనితీరుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ అనేది కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఘర్షణలకు లేదా సభా రద్దుకు వేదిక కాకూడదని, అది దేశ సమస్యలపై తీవ్రమైన ప్రశ్నలు, బాధ్యతాయుతమైన సమాధానాలు మరియు అర్ధవంతమైన పరిష్కారాల (Resolution) కేంద్రంగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కీలక బిల్లులపై చర్చలు జరగకుండా నిరంతరాయంగా సభా కార్యకలాపాలను అడ్డుకోవడం వల్ల ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా, ప్రజల తరఫున చట్టాలు చేసే ప్రక్రియ మందగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నిరసన తెలియజేసే హక్కును తాము గౌరవిస్తామని, అయితే ఆ నిరసనలు సభా నియమ నిబంధనలకు లోబడి ఉండాలే తప్ప సభను పూర్తిగా స్తంభింపజేసేలా ఉండకూడదని రిజిజు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తారని ఎన్నో ఆశలతో ఎంపీలను ఎన్నుకుంటారని, కానీ ఉభయ సభలలో గందరగోళం వల్ల ఆ సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయన్నారు. రాబోయే సమావేశాలలో దేశ ఆర్థిక వృద్ధి, శాంతిభద్రతలు, మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీటన్నింటిపై ప్రతిపక్షాలు సానుకూల దృక్పథంతో చర్చలలో పాల్గొని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కిరణ్ రిజిజు ఇవాళ ఉదయం ప్రత్యేకంగా పిలుపునిచ్చారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande