మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్: రూ. 10,000 కోట్ల నిధుల మంజూరు
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్: రూ. 10,000 కోట్ల నిధుల మంజూరు
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్: రూ. 10,000 కోట్ల నిధుల మంజూరు


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ (Musi River Front Development) ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు (World Bank) ఇవాళ భారీ ఆర్థిక సహాయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దాదాపు రూ. 10,000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ఇవాళ సచివాలయంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నది వెంబడి మురుగునీరు కలవకుండా అత్యాధునిక ఎస్టీపీ (STP - Sewage Treatment Plants) ప్లాంట్ల ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నది ఇరువైపులా పచ్చని పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, నైట్ బజార్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఆక్రమణల తొలగింపు మరియు బాధితులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. నిర్వాసితులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు, తగిన ఆర్థిక సహాయాన్ని అందించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని, ఇందుకు సంబంధించిన సర్వే ఇవాళ ఉదయం నుండే ప్రారంభమైందని మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande