అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ప్రమాదం.. హోంమంత్రికి స్వల్ప గాయం..!
తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘అమరావతి ఛాంపియన్ షిప్’ క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
accident-at-amaravati-championship-event-home-minister-anita-suffers-


తిరుపతి , 24 ఆగస్టు (హి.స.) తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘అమరావతి ఛాంపియన్ షిప్’ క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతిపై ఓ డ్రోన్ బ్యాటరీ పడటంతో ఆమెకు గాయమైనట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ డ్రోన్ను సీజ్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏర్పాటు చేసిన వేదిక పైకి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి కార్యక్రమంలో హోంమంత్రి చురుగ్గా పాల్గొన్నారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు

మరోవైపు, ఈ ప్రతిష్టాత్మక పోటీలు సరికొత్త రికార్డు సృష్టించి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి అండర్-17, అండర్-23 విభాగాలకు చెందిన 9 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు తరలివచ్చారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరైన ఈ ప్రారంభోత్సవంలో.. లిమ్కా బుక్ ప్రతినిధి హరీశ్ చేతుల మీదుగా రికార్డు పత్రాన్ని శాప్ చైర్మన్ రవి నాయుడు అందుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande