తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో ఓ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవకోన అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దాడి జరిగింది.
తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి


తిరుపతి, 24 ఆగస్టు (హి.స.) తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో ఓ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవకోన అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దాడి జరిగింది. జీవకోనలో నివాసం ఉంటున్న మైనర్ బాలికపై కొందరు యువకులు బ్లేడ్లతో దాడికి పాల్పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో బాలిక తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను రక్షించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande