
న్యూఢిల్లీ, 25 ఆగస్టు (హి.స.)
ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) క్యాంపస్‌లో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులను యాజమాన్యం ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెలుపల బైఠాయించారు. ఈ ఫీజుల పెంపు వల్ల మధ్యతరగతి, పేద విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి పెంచిన ఫీజులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శాంతిభద్రతల పరిరక్షణకు క్యాంపస్ లోపల, వెలుపల అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi