అర్హత లేని వ్యక్తులను రేవంత్ కలవాలనుకుండు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
అర్హత లేని వ్యక్తులను రేవంత్ కలవాలనుకుండు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
Kishan Reddy


న్యూఢిల్లీ, 25 ఆగస్టు (హి.స.)

అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాకుండానే ఆదరాబాదరాగా అమెరికా పర్యటన పెట్టుకున్నారని కామెంట్ చేశారు. అమెరికా పర్యటనలో అర్హతలేని వ్యక్తులను కలవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని ఆరోపించారు. 2005లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో అమెరికా, లండన్, ఇతర దేశాల పర్యటనలకు కేంద్రం అనుతినిచ్చిందని పేర్కొన్నారు. కానీ, ఈసారి మాత్రం స్పష్టమైన.. పరిపాలనాపరమైన కారణాల వల్లే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అమెరికా (America) పర్యటనపై ఆయన స్పష్టతనివ్వలేదని ఫైర్ అయ్యారు. గతంలో చాలామంది సీఎంలకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అనుమతినివ్వని రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. విదేశాల్లో మన సీఎంలు ఎవరిని కలుస్తారు.. వాటితో దేశానికి ఏం ప్రయోజనం అనేది భారత విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని.. అనుమతులు ఇస్తుందని తెలిపారు. పాకిస్తాన్ (Pakistan)కు అనుకూల వ్యక్తి, ఇండియాపై నిత్యం విషం చిమ్మే వ్యక్తి న్యూయార్క్ మేయర్ అని ధ్వజమెత్తారు. భారత ప్రధాని మోడీని ఉగ్రవాదితో పోల్చిన వ్యక్తి ఇదే మర్దనీ (Mamdani) కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్ హిందువుల పండుగలపై ఆంక్షలు పెట్టిన వ్యక్తితో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన స్థాయికి తగిన వారితో చర్చించాలని.. విదేశాలను తాను వెళ్లకుండా కూడా అధికారుల బృందాన్ని పంపి పెట్టుబడులు సాధించవచ్చని కిషన్ రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande