
అమరావతి, 27 ఆగస్టు (హి.స.)
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2.153 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండపై పురాతన ఆలయం, ప్రకృతి వనరుల సంరక్షణకు ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలను ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ