
అమరావతి, 27 ఆగస్టు (హి.స.)
అమృతలూరు: వేమూరు నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.7,73,839 సాయాన్ని ఎమ్మెల్యే
నక్కా ఆనందబాబు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న శివ నాగేంద్రమ్మ, శ్రీనివాసరావు, ప్రేమానందం వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సిఫార్సు ద్వారా సీఎం సహాయనిధి కార్యాలయానికి పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఆర్థిక సహాయం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరు చేసింది. ఈ మేరకు గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే స్వయంగా ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో అవసరమైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ