
జగిత్యాల, 27 ఆగస్టు (హి.స.)
జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ అధికారులు
భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. మెట్పల్లి ఎక్సైజ్ సీఐ వినోద్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలం తాండ్రియాల్ ఎక్స్రేడ్ వద్ద చేపట్టిన మెరుపు తనిఖీల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నామని, ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో మద్యం తరలిస్తున్నారని, పైకి చూస్తే వాహనం ఖాళీగా కనిపించేలా, లోపల మినీ రూమ్ల ఏర్పాటు చేశారు.
ఆ రూమ్లో 70 కాటన్ల మద్యాన్ని తరలిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలోని దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నుంచి ఈ మద్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలింది. అక్కడ రూ.2.80 లక్షల విలువ చేసే ఈ మద్యం, తెలంగాణలో రూ.6.98 లక్షలు ఉంటుందని తెలిపారు. దాదాపు రూ.4.18 లక్షల వ్యత్యాసం ఉంది. కథలాపూర్ మండలంలోని బెల్ట్ షాపులే టార్గెట్గా ఈ దందా సాగుతోందని అన్నారు. మహారాష్ట్రలోని భివాండికి చెందిన ప్రవీణ్ పై ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో నిఘా పెట్టి ఈ గుట్టును రట్టు చేశామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..