ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఇస్తానని.. ఒక్క రూపాయి ఇవ్వలేదు: రామచందర్రావు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు.
Ramachandra rao


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిధులు ప్రకటించి ఏడాది గడిచినా.. రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు.

‘‘టీచర్లకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని స్వయంగా సీఎం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తోంది. విద్యార్థుల విషయంలో మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని చెప్తూనే ఉన్నాం. పాలిటెక్నిక్ కోర్సు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం సరికాదు. మీ నిర్ణయం సరైనది అయితే.. మళ్లీ కమిటీ ఎందుకు వేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.15వేల కోట్లకు చేరాయి. యంగ్ ఇండియా స్కూల్స్ అని గొప్పగా చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి.. భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో విద్యార్థులు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. విద్యార్థులను రాజకీయంగా వాడుకునే కాన్సెప్ట్కు మేం వ్యతిరేకం. వారి ఉద్యమంలోకి మేం వెళ్లం.. నైతికంగానే మద్దతు ఇస్తాం’’ అని రామచందర్రావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande