శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
Cricket


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు

మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి టెస్టుల్లో విజయం సాధించిన భారత జట్టు, ఈ డ్రాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0 తేడాతో తమ సొంతం చేసుకుంది. ఐదో రోజు శ్రీలంక బ్యాటర్లు తీవ్రంగా పోరాడటంతో మ్యాచ్ సమంగా ముగిసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 503/9 వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) బాధ్యతాయుత సెంచరీలతో రాణించగా, రిషబ్ పంత్ (63) వేగవంతమైన అర్ధసెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు 290 పరుగులకే పరిమితం చేశారు. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుషా (103) సెంచరీతో రాణించినప్పటికీ, భారత్ కు 213 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిపత్యం లభించింది. దీంతో భారత కెప్టెన్ శ్రీలంకను ఫాలో-ఆన్ ఆడాల్సిందిగా ఆదేశించాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఆచితూచి ఆడింది. సోనాల్ దినుషా (133 నాటౌట్), పాసిందు సూర్యబండార (92) గట్టి పట్టుదలతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా వైపు నడిపించారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/9 స్కోరు సాధించింది. దీంతో విజయం సాధ్యపడక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande