భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!
Gold is cheaper in the bullion market, silver prices also decline slightly


ముంబై, 04 ఆగస్టు (హి.స.)ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆగస్ట్ 4వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

బంగారం ధరలు దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే ప్రస్తుతం ఆషాడ మాసం నడుస్తోంది. ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండవు కాబట్టి బంగారు ఆభరణాల దుకాణాల వారు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పలు దుకాణాల వారు బంగారం పైన డిస్కౌంట్ లో అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కస్టమర్లు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం తగ్గించేసారని ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,360 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.

---

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande