గుజరాత్లో 'చాందీపుర వైరస్' కలకలం.. 22 మంది మృతి
గుజరాత్లో 'చాందీపుర వైరస్' కలకలం.. 22 మంది మృతి
Gujarat


గుజరాత్, 04 ఆగస్టు (హి.స.)

గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్

కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలోనే 184 అనుమానిత కేసులు కూడా ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 22 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. 15 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

1965 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్ పరిధిలో ఉన్న చాందీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే ప్రమాదం ఉంది. మట్టి గోడలు, పగుళ్లలో నివసించే ఇసుక ఈగలు కుట్టడం వల్ల ఈ వైరస్ సోపుతుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల దోమలు, నల్ల ఈగలు కూడా ఈ వ్యాధికి కారణం అవుతున్నాయి. ఈ వైరస్ నేరుగా మెదడుపై దాడి చేసి వాపును కలగజేస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి సోకిన వాళ్ల పరిస్థితి 24 నుంచి 48 గంటల్లోనే విషమంగా తయారు అవుతుందని సమాచారం.

ఉన్నఫలంగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయి. విపరీతమైన నీరసం, మూర్చ రావడం లాంటివి కూడా కనిపిస్తాయి. మానసిక గందరగోళం.. కోమాలోకి వెళ్లడం లాంటివి జరుగుతాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కూడా లేదని చెబుతున్నారు. వ్యాధి సోకగానే, ఆస్పత్రిలో స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande