భూమి.. నైపుణ్యం... నిరంతర విద్యుత్ మా బలాలు
శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భట్టి విక్రమార్క పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని వెల్లడి.
Bhatti vikramarka


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. పారిశ్రామిక కారిడార్లలో తయారీ, ఐటీ, జీవశాస్త్రం, స్వచ్ఛ ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని కోరారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్(డ్రైవర్ లేకుండానే ప్రయాణించేే) వాహనంలో భట్టి ప్రయాణించారు. ఆ వాహనాల నిర్వహణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై దాని సాంకేతికత, నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్తోపాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో డ్రైవర్లెస్ మొబిలిటీని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande