
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో పొత్తులు, చేరికల రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన మధ్య తాజా పరిణామాలు తెలంగాణలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో తాము ఒంటరిగానే వెళ్తామని బీజేపీ స్టేట్ చీప్ రామచందర్ రావు స్టేట్మెంట్ ఇవ్వగా, ఇది రామచందర్ రావు పరిధిలోని అంశం కాదని పొత్తుల అంశాన్ని పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందంటూ జనసేన తెలంగాణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరువు నేతల మధ్య డైలాగ్ వార్ చల్లారక ముందే మిత్రపక్షం బీజేపీకి జనసేన బిగ్ షాక్ ఇచ్చింది. పలువురు బీజేపీ నాయకులను జనసేన పార్టీలో చేరడం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. త్వరలోనే బీజేపీలో ఇతర పార్టీల పెద్ద తలకాయలు చేరబోతున్నాయని కమలం పార్టీ అగ్రనేతలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఇంత కాలం బీజేపీ కోసం సీరియస్గా పని చేసిన పలువురు నాయకులు జనసేన గూటికి చేరడం, వారిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి ఆహ్వానించడంతో తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు