మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
gold


ముంబై, 01 సెప్టెంబర్ (హి.స.)అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పతనం అవుతోంది. భారత్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గత వారం చివర్లో మొదలైన ధరల తగ్గుదల ఈ వారం కూడా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 1) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,760 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,43,690గా ఉంది. 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,17,570 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉంది. నిన్న హైదరాబాద్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.1400 పైచిలుకు మేర పతనమైన విషయం తెలిసిందే.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,910 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,840 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 వద్ద కొనసాగుతోంది.

కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande