
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత (Kavitha) నిజామాబాద్ సభలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి స్పందించారు. భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కవిత మధ్యలో వచ్చారు.. మధ్యలోనే వెళ్లారు. కష్టకాలంలో కేసీఆర్కు అండగా ఉంది నేనా? పార్టీని వదిలెళ్లిన కవితనా? నేను కాంగ్రెస్లో చేరడానికి ఎవరితోనూ మంతనాలు జరపలేదని నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా. రహస్యంగా కాంగ్రెస్ నాయకులను కలవలేదని ఆమె చెప్పగలరా? మొదటి నుంచి బీఆర్ఎస్లో ఉన్న నాయకులను కవిత టార్గెట్ చేస్తున్నారు. మాపై నిరాధార ఆరోపణలు చేసి మా పార్టీని బలహీనపర్చి, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఆమె వ్యవహరిస్తున్నారు’’ అని ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్