
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్కే పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పంలో జరిగిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ కేడర్ను రెచ్చగొట్టారని, రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తామని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు కుప్పం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై కుప్పం అర్బన్ పోలీసులు ఎమ్మెల్సీ భరత్పై 206/2026 యూ/ఏఎస్ 192, 353/(1)(బీ), 351(2) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ