
తెలంగాణ , 13 సెప్టెంబర్ (హి.స.)బీసీ జనసభ రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్కు ఎలాంటి ఆపద కలగకూడదని, ఆయన ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మల్లన్న స్వామి సన్నిధిలో 21 పట్నాలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పట్ల కాంగ్రెస్ నాయకులు కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కోలేకనే వ్యక్తిగత విమర్శలు, అవమానకర చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్