
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేడు లాభాలతో మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ , 2 దూసుకుపోతున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 74,460 వద్ద.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
జీఐఎఫ్ఎ నిఫ్టీ నుంచి అందిన సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. నిన్నటి ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 777 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది. ఇది గత ఐదు నెలల్లో నిఫ్టీకి అత్యంత కనిష్ఠ ముగింపు స్థాయి కావడం గమనార్హం. ఇంట్రాడేలో లాభాల్లో ఉన్నప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) కు సంబంధించిన సానుకూల వార్తల నేపథ్యంలో పేటీఎం షేరు ఏకంగా 7 శాతం వరకు పెరగడం విశేషం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..