
తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)ఊట్కూర్ రైతు వేదికలో గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు, యువతతో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శోభాయాత్రల్లో నిబంధనలు ఉల్లంఘించి డీజే లు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, నారాయణపేట ఆర్డీవో ఉత్తర్వుల మేరకు డీజేలపై నిషేధం అమల్లో ఉందని తెలిపారు. డీజేలకు బదులుగా సంప్రదాయ వాయిద్యాలు, సాంస్కృతి క కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు. నిమజ్జన సమయంలో భక్తులు, యువత అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్