
ఆంధ్రప్రదేశ్ , 17 సెప్టెంబర్ (హి.స.) వైఎస్సార్సీపీ నేత మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు నాగేశ్వరరావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఆయణ్ని విచారించి అరెస్ట్ చేసి హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఇవాళ సిట్ అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కారుమూరి రిమాండ్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. ఆయణ్ని చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్