కేసీఆర్ భూముల వివరాలను సేకరిస్తున్న రెవెన్యూ అధికారులు
రాష్ట్ర రెవెన్యూ అధికారులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భూముల వివరాలను సేకరిస్తున్నారు.
Kcr


తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర రెవెన్యూ అధికారులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఫామ్ హౌస్ కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రికార్డులను రెవెన్యూ అధికారులు నివేదికల రూపంలో తయారు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఫామ్హౌస్పై విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ పై అధికారులు దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande