
ఆంధ్రప్రదేశ్ , 17 సెప్టెంబర్ (హి.స.)విజయవాడలో రేషన్ డీలర్ల సమాఖ్య డీలర్లు సంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షుడు లీల మాధవరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డీలర్లు హాజరయ్యారు.
సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. బియ్యం బస్తాలపై కోడ్-స్కానింగ్ ప్రక్రియకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి వచ్చే వరకు దానిని నిలిపివేయాలని, ఆ తర్వాతే అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.
అలాగే సరుకుల ఇంటింటి పంపిణీ (డోర్-డెలివరీ) కోసం డీలర్లకు నెలకు రూ.5,000 చెల్లించాలని, ఇంటి నంబర్ల ఆధారంగా దుకాణాల మ్యాపింగ్ చేపట్టాలని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కమిషన్ను యూనిట్కు రూ.2కు పెంచాలని వారు కోరారు.
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లకు రూ.5,000, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.7,500 గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్