
హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 3,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు, నిర్వాహకులు తెలిపారు. సూర్యాపేటతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యువతను ఈ కార్యక్రమానికి సమీకరిస్తున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు డిప్లొమా విద్యార్థులు, ఇతర అర్హతలు ఉన్న యువత కూడా ఉద్యోగ మేళాలో పాల్గొనే అవకాశం ఉంది.
ఒకే ప్రాంతంలో అనేక కంపెనీలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, పరిశ్రమల శాఖ సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్