ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Minister


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిధులు అందేలా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక సడలింపులు ఇచ్చామని ఇవాళ ప్రకటించారు.ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో మంజూరులకు దీనిని ప్రాతిపదికగా తీసుకోకూడదని మంత్రి స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande