ప్రభుత్వ సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వ విప్
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ విజయ రమణారావు అన్నారు.
Mla


పెద్దపల్లి, 21 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ విజయ రమణారావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార కార్యక్రమాన్ని హరేరామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి విద్యార్థులతో కలిసి విజయరమణ రావు అల్పాహారం చేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.65 కోట్లతో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, నూతన తరగతి గదులు, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande