
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
అక్రమంగా నడిపిస్తున్న హుక్కా కేంద్రంపై కుషాయిగూడ పోలీసులు దాడులు జరిపారు. నేతాజీ నగర్ చౌరస్తాకు సమీపంలో రాంకీ బండి సమీపంలో ఉన్న ఎలైట్ కేఫ్ లో వెనకవైపు అక్రమంగా హుక్కా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పోలీసులు దాడులు జరపగా పలు రకాల నిషేధిత ఫ్లవర్స్, హుక్కా సేవిస్తూ యువకులు పట్టుబడ్డారు. దీంతో కేంద్రాన్ని నిర్వహిస్తున్న మేనేజర్ దిలీప్, 13 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలు రకాల ఫ్లేవర్లను, నగదును స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు