ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధికారులు సత్వర పరిష్కారం చూపాలి.. కలెక్టర్
ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Collector


రాజన్న సిరిసిల్ల, 21 సెప్టెంబర్ (హి.స.)

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 172 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande