
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో కరమ్ పండుగ ముగింపు సందర్భంగా తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కరమ్ చెట్టు కొమ్మల నిమజ్జనం కోసం కోయల్ నదికి వెళ్లిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా మొదట నలుగురి మృతదేహాలను వెలికితీయగా, కొద్దిసేపటికే ఐదో యువకుడి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ వేళ ఒక్కసారిగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi