దసరా పండుగ సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలు
దసరా పండుగ సందర్భంగా వ్యాపారులు, దుకాణదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనంతపురం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
దసరా పండుగ సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలు


అనంతపురం, 24 సెప్టెంబర్ (హి.స.)దసరా పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అనంతపురం జిల్లా పోలీసులు పలు ప్రత్యేక చర్యలు మరియు హెచ్చరికలు జారీ చేశారు.

జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనంతపురం అర్బన్ ఎస్డీపీఓ ఎం.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుకాణదారులు, వ్యాపారస్తులతో సీఐ జి.కౌలుట్లయ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. దసరా పండుగను అడ్డుపెట్టుకుని ఎవరైనా వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వ్యాపారులు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అలాగే దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande