తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. సాలకుంట్ల భ్రహ్మోత్సవాల నేపథ్యంలో గత ఐదు రోజులు స్వల్పంగా ఉన్న భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.
తిరుమల


తిరుమల, 24 సెప్టెంబర్ (హి.స.)తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. సాలకుంట్ల భ్రహ్మోత్సవాల నేపథ్యంలో గత ఐదు రోజులు స్వల్పంగా ఉన్న భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, వైద్య సదుపాయాలను టీటీడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అందిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande