వైసీపీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతిపై జగన్ దిగ్భ్రాంతి
వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతి చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు. రాజశేఖర్ మరణంపై వైసీపీ అధినేత జగన్ ,రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని ల
jagan-shocked-by-the-death-of-ycp-state-campaign-president-r


అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.) వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతి చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు. రాజశేఖర్ మరణంపై వైసీపీ అధినేత జగన్ ,రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తంగా తనకు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొన్నారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి చుండూరు రవిబాబు సైతం రాజశేఖర్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గతంలో రాజశేఖర్ ఏపీలో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande