
మంగళగిరి, 30 సెప్టెంబర్ (హి.స.)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనతో కొనసాగింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.
ఈ ప్రజాస్రవంతి కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, హౌసింగ్, పింఛన్లు మరియు ఇళ్ల స్థలాలకు సంబంధించిన విజ్ఞప్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఈ గ్రీవెన్స్ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi