వైసీపీ, టీడీపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉంది : విజయసాయి రెడ్డి
ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తరవాత కమ్మ క్రిస్టియన్ వర్గాలకే రాష్ట్రంలో అధికారం వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
విజయసాయి రెడ్డి


విశాఖపట్టణం, 30 సెప్టెంబర్ (హి.స.)ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తరవాత కమ్మ క్రిస్టియన్ వర్గాలకే రాష్ట్రంలో అధికారం వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

వైజాగ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని చెప్పారు. రెండు కూడా కుటుంబ పార్టీలేనని, కేంద్రం విభజన హామీలు నెరవేర్చకపోయినా, హామీలు అమలు చేయకపోయినా రెండు పార్టీలు కేంద్రాన్ని అడగవు అని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవుల కోసం టీడీపీ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

2029 ఎన్నికల్లో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వారికే పదవులే ముఖ్యమని చంద్రబాబుకు తన కుమారుడిని సీఎం స్థానంలో ఎలా కూర్చోబెట్టాలన్నదే ముఖ్యమని చెప్పారు. జగన్ కు కూడా తన కుటుంబ సభ్యులను ఎలా రాజకీయాల్లోకి తీసుకురావాలన్నదే లక్ష్యం అని అన్నారు. రాష్ట్రానికి పదేళ్లలో ఒక్క గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రాలేదని చెప్పారు. 12ఏళ్లలో 12 లక్షల కోట్లు అప్పు చేశారని, నిజంగా అది రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడిందని ప్రశ్నించారు.పన్నెండేళ్లలో యువత కోసం ఎలాంటి ఉద్యోగాలను తీసుకురాలేదని చెప్పారు. రెడ్ బుక్ పార్టీకి ఓటెయ్యాలా.. రప్ప రప్ప పార్టీకి ఓటెయ్యాలా అని యువతనే ఆలోచించుకోవాలన్నారు. రెండు పార్టీల్లో ఒకటి కులపిచ్చి పార్టీ, మరొకటి మతపిచ్చి పార్టీ అని చెప్పారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాబోతున్న పార్టీ కోసం యువత ముందుకు రావాలన్నారు. తాను స్థాపించబోయే పార్టీ అధికారంలోకి వచ్చినా తాను సీఎంగా ఉండనని స్పష్టం చేశారు. సీఎంగా వేరేవాళ్లకే అవకాశం ఇస్తామని చెప్పారు. పార్టీలో అన్ని కులాల ప్రజలకు సమాన అవకాశాలుంటాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande