జిల్లాల అధ్యక్షుల ఎంపికలో సమర్థులకే అవకాశం.. ఏఐసీసీ అబ్దర్వర్ నవజ్యోతి పట్నాయక్.
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షుల ఎంపికలో సమర్థులకే అవకాశం ఉంటుందని ఏఐసీసీ అబ్దర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్
ఎ ఐ సి సి


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

వరంగల్, హన్మకొండ జిల్లాల

అధ్యక్షుల ఎంపికలో సమర్థులకే అవకాశం ఉంటుందని ఏఐసీసీ అబ్దర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడం కోసం. జిల్లా అధ్యక్షుల ఎంపిక విధానంలో పారదర్శకత, నిబద్ధత, సామర్థ్యం ఉండేలా పునః సంఘటన కార్యక్రమం చేపడుతున్నాం అని ఆయన వెల్లడించారు. జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ కార్యకర్తలు, మాజీ పదవి దారులు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, సివిల్ సొసైటీ సభ్యులు,సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande