అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి ఉదయం 9.54 గంటలకు భవనాన్ని ప్రారంభించారు సీఎం. వేదమంత్రోచ్ఛారణల మధ్య భవనాన్ని ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలీస్తుండగా... భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ (Minister Narayana) వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ