సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో వివిధ సంక్షేమ విభాగాల ఉన
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై

అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande